Telugu News » Shri Ram Prana Pratishtha: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు అంతా సిద్ధం.. షెడ్యూల్ ఇదే..!

Shri Ram Prana Pratishtha: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు అంతా సిద్ధం.. షెడ్యూల్ ఇదే..!

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన హిందూ సంప్రదాయాలు,

by Mano
Shri Ram Prana Pratishtha: Everything is ready for the inauguration of Shri Ram Prana Pratishtha.. This is the schedule..!

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన హిందూ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ క్రతువులు జనవరి 16 నుంచి 21 వరకు నిరంతరాయంగా జరగనున్నాయి.

Shri Ram Prana Pratishtha: Everything is ready for the inauguration of Shri Ram Prana Pratishtha.. This is the schedule..!

సరయూ నది(Sarayu River) ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గో సమర్పణ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జనవరి 18న శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చే అభిజిత్ ముహూర్తాన విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు

శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ పౌష్ శుక్ల కుర్మ ద్వాదశి, విక్రమ సంవత్సరం 2080 అంటే, 2024 జనవరి 22 (సోమవారం) రోజున జరుగుతుంది. జనవరి 16న ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజ, జనవరి 17న ఆలయ ప్రాంగణంలోకి విగ్రహ ప్రవేశం, జనవరి 18 సాయంత్రం తీర్థ పూజ, జలయాత్ర, జలధివాస్, గంధ ధివాస్ నిర్వహించనున్నారు.

అదేవిధంగా జనవరి 19న ఉదయం ఔషధ ధివాస్, కేశర ధివాస్, ఘృతాధివాస్, అదే రోజు సాయంత్రం ధాన్యాధివాస్, జనవరి 20న ఉదయం శక్రాధివాస్, ఫలధివాస్‌, సాయంత్రం పుష్పాధివాస్, జనవరి 21న ఉదయం మధ్యాధివాస్, జనవరి 22 (సాయంత్రం) శయ్యాధివాస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీరాముని విగ్రహం బరువు 150-200 కిలోల వరకు ఉంటుందని సమాచారం.

121 మంది ఆచార్యులు ఈ క్రతువు నిర్వహిస్తారని రామజన్మభూమి కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. 150కిపైగా సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఈ క్రతువును నిర్వహిస్తారని వెల్లడించారు. జనవరి 23 నుంచి భక్తులకు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment