రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడ్డాక అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీసీ (BC) కులగణన పై సైతం ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. ఇక త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం కాంగ్రెస్ (Congress) సమాయత్తం అవుతున్న వేళ దళిత నాయకులు హస్తానికి టెన్షన్ పుట్టించే అంశం తెరపైకి తెచ్చారు..
మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయించాలనే అంశంపై నాయకులు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు పార్లమెంట్, అసెంబ్లీ నామినేటెడ్ పదవుల్లో ఉన్న తమ వాటా తమకు ఇవ్వాలని కోరారు. అంతేగాక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాదిగ కులానికి చెందిన గజ్జెల కాంతంకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరంగల్ ఎంపీ టిక్కెట్ పిడమర్తి రవికి ఇవ్వాలని దళిత సంఘాల నేతలు గాంధీ భవన్ ఎదుట డప్పులు, నినాదాలతో నిరసనకు దిగారు. మరోవైపు రాష్ట్రంలో 2011-21 లెక్కల ప్రకారం మాదిగలు దాదాపు 80 లక్షల మంది ఉన్నారని తెలిపిన నేతలు.. ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒక్కోదాంట్లో 4 లక్షలకు పైగా జనభా ఉన్నారని, ఆ రెండు స్థానాలతో పాటు మాదిగలకు మరొక జనరల్ సీటు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు..