బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత (Madhavilatha), ఒవైసీ మధ్య రోజు రోజుకి వివాదం ముదురుతోంది. అసలే లోక్ సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో పావులు కదుపుతున్న ఈ ఇద్దరు నేతలు.. విమర్శలు చేసుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఈ క్రమంలో పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్ (Owaisi Brothers) చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని ఆమె హెచ్చరించారు.

మరోవైపు వినయ్‌నగర్ విజయ వినాయక ఆలయంలో ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాధవీలత జోక్యం చేసుకుని సర్థి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా శ్రీరామ నవమి శోభాయాత్ర (Sri Ram Navami Shobhayatra) సందర్భంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే..
వాహనంపై ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఓ మసీదు వద్ద బాణం వేసినట్లుగా మాధవీలత సంజ్ఞ చేశారు.. ఈ ఘటనపై అసదుద్దీన్ తీవ్రంగా స్పందించడం జరిగింది. మరోవైపు ఆమె కూడా ఎదురు దాడికి దిగి ఇంకో సారి ఇలాంటి వీడియోలు చేసి చెత్త హర్కత్‌లకు పాల్పడితే పతంగి కట్ చేస్తా.. ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా మరోసారి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి..