హెచ్ఎండీఏ మాజీ కమిషనర్, విపత్తుల నివారణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు తెలంగాణ (Telangana) ప్రభుత్వం షాకిచ్చింది. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ కోసం 50 కోట్లు ఎలా మంజూరు చేశారో తెలపాలని ప్రభుత్వం వివరణ కోరినట్టు తెలుస్తోంది. ఏ హోదాలో కేబినెట్ అనుమతి లేకుండా సంతకాలు చేశారని ప్రశ్నించింది. అదీగాక ఫార్ములా ఈ ఆపరేషన్స్‌లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
మరోవైపు ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి, ఈ రేస్‌కు బదిలీ చేశారని, అరవింద్ కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగసుకుంటోందని భావిస్తున్నారు.. అయితే ప్రభుత్వ ఆదేశాలకు అరవింద్ కుమార్ ప్రస్తుతం వరకు స్పందించలేదని సమాచారం.. ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.
గత తెలంగాణ సర్కార్, ఫార్ములా ఈ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న సర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో (Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ (Formula E Race)ను రద్దు చేస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. మున్సిపల్ శాఖ (GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ విషయంలో మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతోన్నారు. మరోవైపు హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో తెలిపింది. ఇక ఫార్ములా ఈ రేస్ రద్దు కావడం నిరాశపరిచిందని అంటున్నారు ఫార్ములా ఈ ఛీఫ్ ఆఫీసర్ అల్బర్టో లాంగో. మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు కూడా పెద్ద డిసప్పాయింట్ అని పేర్కొన్నారు..