Telugu News » Hyderabad : చిక్కుల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌.. 50 కోట్ల రూపాయలపై ముదురుతోన్న వివాదం..!!

Hyderabad : చిక్కుల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌.. 50 కోట్ల రూపాయలపై ముదురుతోన్న వివాదం..!!

ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి, ఈ రేస్‌కు బదిలీ చేశారని, అరవింద్ కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగసుకుంటోందని భావిస్తున్నారు..

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

హెచ్ఎండీఏ మాజీ కమిషనర్, విపత్తుల నివారణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు తెలంగాణ (Telangana) ప్రభుత్వం షాకిచ్చింది. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ కోసం 50 కోట్లు ఎలా మంజూరు చేశారో తెలపాలని ప్రభుత్వం వివరణ కోరినట్టు తెలుస్తోంది. ఏ హోదాలో కేబినెట్ అనుమతి లేకుండా సంతకాలు చేశారని ప్రశ్నించింది. అదీగాక ఫార్ములా ఈ ఆపరేషన్స్‌లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

మరోవైపు ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి, ఈ రేస్‌కు బదిలీ చేశారని, అరవింద్ కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగసుకుంటోందని భావిస్తున్నారు.. అయితే ప్రభుత్వ ఆదేశాలకు అరవింద్ కుమార్ ప్రస్తుతం వరకు స్పందించలేదని సమాచారం.. ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.

గ‌త తెలంగాణ స‌ర్కార్‌, ఫార్ములా ఈ మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. కానీ ప్రస్తుతం ఉన్న స‌ర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో (Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ (Formula E Race)ను రద్దు చేస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. మున్సిప‌ల్ శాఖ‌ (GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

ఈ విషయంలో మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతోన్నారు. మరోవైపు హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో తెలిపింది. ఇక ఫార్ములా ఈ రేస్‌ రద్దు కావడం నిరాశపరిచిందని అంటున్నారు ఫార్ములా ఈ ఛీఫ్ ఆఫీసర్ అల్బర్టో లాంగో. మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు కూడా పెద్ద డిసప్పాయింట్ అని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment