Telugu News » Hyderabad : రాష్ట్ర ప్రజలకు ఐఎండీ శుభవార్త.. భానుడి భగభగలతో ఉపశమనం..!

Hyderabad : రాష్ట్ర ప్రజలకు ఐఎండీ శుభవార్త.. భానుడి భగభగలతో ఉపశమనం..!

నిన్న మరాత్వాడా పరిసరాల మధ్య మహారాష్ట్ర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని వివరించింది.

by Venu
2 states Weather Report

రాష్ట్రంలో భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ప్రజలకి హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ ( Meteorological Centre) చల్లని కబురు అందించింది. రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వానజల్లులు (Rainfall) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే ఇప్పటికే పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం నమోదైందని తెలిపింది..

TamilNadu: Heavy rains.. Lowland areas flooded..!మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే గాలి విచ్చిన్నతి ఒకటి సౌరాష్ట్ర కచ్ వద్ద వున్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే నిన్న మరాత్వాడా పరిసరాల మధ్య మహారాష్ట్ర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని వివరించింది. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులతో.. రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలలోపే నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు..

ఇదిలా ఉండగా నల్గొండ (Nalgonda) జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వేసవి వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు, అకాల వర్షం (Untimely Rain) కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చింది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, అమ్మకానికి ఉంచిన వడ్లు తడిసిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు..

You may also like

Leave a Comment