Telugu News » Hyderabad : పోలీసులకు కీలక ఆదేశాలు.. హైదరాబాద్‌లో హై అలర్ట్..!!

Hyderabad : పోలీసులకు కీలక ఆదేశాలు.. హైదరాబాద్‌లో హై అలర్ట్..!!

ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని పోలీసులకు సూచించారు.

by Venu

అయోధ్య (Ayodhya) రామాలయ ప్రారంభోత్సవం ( Ram Mandir Inauguration) వేళ అల్లర్లు సృష్టిస్తామని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి వస్తున్న బెదిరింపుల వల్ల భద్రతా సిబ్బంది అయోధ్యలో హైఅలర్ట్ విధించారు. మరోవైపు ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ సైతం భారత్‌లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడుతామని యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఇలా ఉగ్రమూకల వరుస హెచ్చరికలతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ( Hyderabad)లో మతపరమైన సున్నిత ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని పోలీసులకు సూచించారు. ఈమేరకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP), గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులకు సహాయం అందిస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసుల బాస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. అలాగే, మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను భారీగా మోహరించినట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.

మరోవైపు స్థానిక పోలీసులకు కీలక ఆదేశాలు అందాయి.. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించాలని డీజీపీ ఆదేశించారు. ఇక, సీనియర్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని మతపరమైన సున్నిత ప్రాంతాలలో విడిది ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలని తెలిపారు.

You may also like

Leave a Comment