Telugu News » Hyderabad : మద్యం మత్తులో యువకుని హాల్ చల్.. బస్సుపై రాళ్ల దాడి..!!

Hyderabad : మద్యం మత్తులో యువకుని హాల్ చల్.. బస్సుపై రాళ్ల దాడి..!!

కొందరు ఆ యువకున్ని పట్టుకొనగా.. అతని ఫ్రెండ్ వచ్చి మద్యం మత్తులో ఉన్న ఆ యువకున్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

by Venu
ts rtc bus

ప్రజల ఆస్తిగా పేర్కొనే ఆర్టీసీ బస్సులపై ఈ మధ్యకాలంలో తరచుగా దాడులు జరుగుతోన్న విషయం తెలిసిందే.. మద్యం మత్తులో రెచ్చిపోతున్న పోకిరీల చేష్టల వల్ల ప్రయాణికులతో పాటు.. బస్సు సిబ్బందికి సైతం తిప్పలు తప్పడం లేదు.. తాగిన మత్తులో చేసే ఇలాంటి దాడుల వల్ల ఒకవేళ ప్రాణాలు అపాయంలో పడితే బాధ్యులు ఎవరనే ప్రశ్నలు సైతం ఎదురవుతోన్నాయి.

అదీగాక మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి నిత్యం బస్సులో గొడవలు చోటు చేసుకోవడం కామన్ గా మారిపోయింది. ఒక దశలో కండక్టర్, డ్రైవర్ పై దాడులకు పాల్పడిన సంఘటనలు సైతం చోటు చేసుకొన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ (Hyderabad).. ఎల్బీనగర్‌ (LB Nagar) సాగర్ రింగ్ రోడ్డు (Sagar Ring Road)లో బస్సుపై రాళ్ల దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

ఎల్బీనగర్ లో, టీఎస్ ఆర్టీసీకి చెందిన (TS08UK098) అనే నంబర్ బస్ పై, ఓ యువకుడు మద్యం మత్తులో రాళ్లదాడి చేశాడు. దీంతో బస్సు అద్దాలు పగిలినట్టు సమాచారం.. అయితే ఈ దాడిపై స్పందించిన బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువకున్ని ప్రశ్నించగా.. వారిపై కూడా దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కండక్టర్‌, డ్రైవర్ అతని దాడి నుంచి తప్పించుకొన్నట్టు సమాచారం..

ఇంతలో కొందరు ఆ యువకున్ని పట్టుకొనగా.. అతని ఫ్రెండ్ వచ్చి మద్యం మత్తులో ఉన్న ఆ యువకున్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మద్యం మత్తులో ఇలా ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం సరైన పద్దతి కాదని ఆర్టీసీ సిబ్బంది మండి పడుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది.

You may also like

Leave a Comment