Telugu News » Hyderabad : చంచల్ గూడ జైలుకు కల్వకుంట్ల కన్నారావు.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..!

Hyderabad : చంచల్ గూడ జైలుకు కల్వకుంట్ల కన్నారావు.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..!

హైదరాబాద్ మన్నెగూడలోని ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన 2ఎకరాల 10గుంటల స్థలాన్ని 38 మందితో కలిసి కన్నారావు కబ్జా చేశారని కేసు నమోదైయింది..

by Venu
kalvakuntla-kanna-rao

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి.. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలతో సతమతం అవుతున్న గులాబీ ముఖ్యనేతలకు మరొక అరెస్ట్ షాక్ ఇచ్చినట్లుగా చర్చించుకొంటున్నారు.. నేడు భూకబ్జా కేసులో కేసీఆర్ (KCR) అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు (Kalvakuntla Kanna Rao) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే..

తాజాగా ఆయనకు ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.. దీంతో ఆదిబట్ల పోలీసులు (Adibatla Police) ఆయనను చంచల్ గూడ (Chanchal Guda) జైలుకు తరలించారు. మరోవైపు తనపై అక్రమ కేసులు బనాయించారని త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తానని కన్నారావు తెలిపారు. తొందర్లోనే తాను బెయిల్ పై బయటకి వస్తానననే ధీమా వ్యక్తం చేశారు..

ఇదిలా ఉండగా హైదరాబాద్ మన్నెగూడలోని ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన 2ఎకరాల 10గుంటల స్థలాన్ని 38 మందితో కలిసి కన్నారావు కబ్జా చేశారని కేసు నమోదైయింది.. ఆదిభట్ల పోలీసులు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కన్నారావును అరెస్టు చేశారు. ఇతను తమ స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను జేసీబీ సాయంతో తొలగించారని ఆరోపించారు.

కొత్త ఫెన్సింగ్ వేయడంతోపాటు గుడిసె వేసి కొందరిని కాపలా ఉంచారని శ్రీనివాస రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కన్నారావు ఈ కేసుకు సంబంధించి వేసిన క్వాష్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. కబ్జాతో పాటు మారణాయుధాలతో అటాక్ చేశారనే అభియోగాలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ తిరస్కరించింది..

You may also like

Leave a Comment