పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ (Congress).. దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ (Hyderabad) శివారు తుక్కుగూడ (Tukkuguda)లో జనజాతర (Janjatara) పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద వాషింగ్ మెషిన్‌గా బీజేపీ మారిందని ఎద్దేవా చేశారు. అతినీతి పరులందరూ ఆయన పంచన చేసరుతున్నారని వెల్లడించారు.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రపంచలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపిన ఆయన.. త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను న్యాయ పత్రం పేరుతో రిలీజ్ చేసిన రాహుల్.. ఇందులో తెలంగాణకు సంబంధించిన 23 ప్రత్యేక అంశాలను పొందుపర్చారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారెంటీల పత్రమని తెలిపిన ఆయన.. మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కార్యక్రమంలో సీఎం