హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవిలత (Kompella Madhavi Latha) శ్రీరామ నవమి శోభాయాత్ర (Sri Ram Navami Shobhayatra) సందర్భంగా వాహనంపై ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఓ మసీదు వద్ద బాణం వేసినట్లుగా సంజ్ఞ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది కాదని సూచించారు..
తమను బూతులు తిడుతూ.. టెర్రరిస్టులు అంటున్నారని మండిపడ్డ ఆయన.. ఇలాంటి చర్యలతో హైదరాబాద్‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ముస్లిం మహిళలతో హిజాబ్ తీసేయాలంటున్నారని.. సౌదీలో ఇలాగే జరుగుతోందని తెలుపుతున్నట్లు వెల్లడించారు.. మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు..
ప్రధాని మోడీ ‘సబ్ కా సాత్’ ‘సబ్ కా వికాస్’ లో భాగంగా తాను హిందువులు, ముస్లింల కోసం కష్టపడాలని నిర్ణయించుకొన్నట్లు పేర్కొన్నారు. ఇక శ్రీరామ నవమి రోజు తాను గాల్లో బాణం వదిలినట్లు చూపిస్తే.. కొందరు వివాదాస్పదంగా మార్చారని మండిపడ్డారు.. అలాగే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.. వీడియో ఎడిట్ చేసి మసీదు వైపు చూపిస్తే తానేం చేయాలని ఫైర్ అయ్యారు..
ఇలా రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందుడేనా మీ పని.. దేశం బాగు పడాలని.. ఓల్డ్ సిటీ బాగుపడాలని లేదా అని అసదుద్దీన్‌ను ఉద్దేశించి విమర్శించారు.. ఇంకో సారి ఇలాంటి వీడియోలు చేసి చెత్త హర్కత్‌లకు పాల్పడితే పతంగి కట్ చేస్తా.. ఊరుకునేది లేదని.. మాధవీలత వార్నింగ్ ఇచ్చారు.