Telugu News » Kishan Reddy : ప్రజలకు ఇస్తున్నవి గ్యారెంటీలా.. కాంగ్రెస్ గారడీలా..?

Kishan Reddy : ప్రజలకు ఇస్తున్నవి గ్యారెంటీలా.. కాంగ్రెస్ గారడీలా..?

గెలిచిన ప్రతిసారి అభివృద్ధి నివేదికను ప్రజల ముందు ఉంచడం జరిగిందన్నారు.. అలాగే గత ఐదేళ్ల సికింద్రబాద్ అభివృద్ధి నివేదిక ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు..

by Venu
union minister kishan reddy serious on campaign about bjp alliance with brs party

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), సికింద్రాబాద్ (Secunderabad) లోక్‌సభ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా మెహబూబ్ కాలేజీలో నిర్వహించే సభలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.. అంబర్ పేట్ నుంచి మూడు సార్లు శాసన సభకు ప్రాతినిథ్యం వహించినట్లు పేర్కొన్నారు..

Kishan Reddy: No connection with BJP: Kishan Reddyగెలిచిన ప్రతిసారి అభివృద్ధి నివేదికను ప్రజల ముందు ఉంచడం జరిగిందన్నారు.. అలాగే గత ఐదేళ్ల సికింద్రబాద్ అభివృద్ధి నివేదిక ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు.. నైతిక విలువలకు కట్టుబడి ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నానని తెలిపిన కిషన్ రెడ్డి.. ప్రజలు తలదించుకునే విధంగా వ్యవహారించనని పేర్కొన్నారు.. అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులు, అవినీతి మచ్చ లేకుండా సేవ చేస్తూ వస్తున్నానని తెలిపారు..

భవిష్యత్ లో కూడా ఇదే కమిట్ మెంట్ తో పని చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.. అదేవిధంగా నాలుగో సారి బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు వహిస్తున్న నన్ను అన్ని వర్గాల ప్రజలు పెద్ద మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.. చివరి శ్వాస వరకు బీజేపీలోనే ఉంటాను, ఈ జెండా మోస్తానని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ (Congress)కు లేదని విమర్శించారు..

ప్రజలకు ఇస్తున్నవి గ్యారెంటీ లా.. లేక అవి కాంగ్రెస్ గారడీలా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. దీనికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అన్నారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు.. మరోవైపు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్ను పోటు పొడవగా.. బీఆర్ఎస్ నిండా ముంచిందని విమర్శలు గుప్పించారు.. కాబట్ట ప్రజలు బీజేపీని మోజారిటీ స్థానాల్లో గెలిపించాలని కోరారు..

You may also like

Leave a Comment