Telugu News » Hyderabad : తెలంగాణ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

Hyderabad : తెలంగాణ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

ప్రభుత్వం పై వీటి వల్ల ప్రతి సంవత్సరం 418.11 కోట్ల భారం పడుతుందన్న పొన్నం ప్రభాకర్.. ఆర్టీసి కుటుంబాలు మాకు మద్దతు ఇచ్చాయి వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఆర్టీసి సంస్థ తమ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు..

minister ponnam prabhakar says free power Scheme Goes onప్రయాణికులతో పలు ఇబ్బందులు ఎదురవుతున్న పట్టించుకోకుండా ఆర్టీసీ సిబ్బంది.. ఓపికగా విధులు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వం తరుపున వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక పెండింగ్ లో 280 కోట్ల బాండ్స్ ఉన్నట్లు నెక్లెస్ రోడ్డులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన పొన్నం.. రెండు రోజుల్లో వాటికి సంబంధించిన పేమెంట్ జరుగుతాయని అన్నారు. మరోవైపు 2017లో 17 శాతం పీఆర్సీ పై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు.

గతంలో జరిగిన అనేక అంశాల వల్ల ఆర్టీసీ సంస్థ PF, CCS లని వాడుకొన్న పరిస్థితి ఉందని వివరించారు. గత ప్రభుత్వం పీఆర్సీ 2017 లో 16 శాతం అమలు చేయలేక పోయిందని మంత్రి తెలిపారు.. ప్రస్తుతం ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ ఒరియంటేషన్ కి ఆర్టీసీ వెళ్తుందన్నారు. ఉద్యోగులకు బోనస్ లు ఇతర బెనిఫిట్స్ ఇచ్చే విధంగా సంస్థ ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 21 శాతం ఫిట్మెంట్ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. 2024 జూన్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు.

ఇక ప్రభుత్వం పై వీటి వల్ల ప్రతి సంవత్సరం 418.11 కోట్ల భారం పడుతుందన్న పొన్నం ప్రభాకర్.. ఆర్టీసి కుటుంబాలు మాకు మద్దతు ఇచ్చాయి వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు మహాలక్ష్మి పథకం వచ్చిన తరువాత బస్సులు ,బస్ స్టాండ్ లు కళకళలాడుతున్నాయని, 60 శాతం ఉన్న అక్యుపెన్సి 100 శాతం దాటిందని మంత్రి వివరించారు. త్వరలో ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియమాలు చేపడతామని తెలిపిన మంత్రి.. ఎక్కడ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదన్నారు..

ఇందుకు 3 వేల కొత్త బస్సులు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ (RTC) విలీనంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని అన్నారు.. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి, కొందరు ఆర్టీసీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు.. మహిళలకు ఉచిత ప్రయాణం పై, ఆటో వాళ్ళని రెచ్చగొడుతు లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

You may also like

Leave a Comment