Telugu News » Hyderabad Police: ఏబీవీపీ నాయకురాలిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు.. వీడియోలు వైరల్..!

Hyderabad Police: ఏబీవీపీ నాయకురాలిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు.. వీడియోలు వైరల్..!

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవో నెం.55కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకురాలిపై మహిళా పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

by Mano
Hyderabad Police: The ABVP leader was locked by the police by her hair.. the videos went viral..!

హైదరాబాద్(Hyderabad) రాజేంద్రనగర్(Rajendra Nagar) వ్యవసాయ విశ్వవిద్యాలయం (Agriculture University)లో కొద్ది రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు జీవో నెం.55కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. విద్యార్థులకు మద్దతుగా నిన్న (బుధవారం) ఏబీవీపీ(ABVP) కార్యకర్తలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.

Hyderabad Police: The ABVP leader was locked by the police by her hair.. the videos went viral..!

అయితే పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కడి నుంచి పరుగు తీశారు. ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై వెంబడించారు. ఝాన్సీ కిందపడిపోయినా స్కూటీపై ఉన్న మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని మరీ కొంతదూరం ఈడ్చుకెళ్లారు.

అనంతరం స్కూటీని ఆపి ఆమెను అలాగే పట్టుకున్నారు. ఝాన్సీ లేచి మహిళలపై ఇలాగేనా ప్రవర్తించేది అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు పోలీసులు ‘అవును.. ఇలాగే ఉంటుంది మరి.. అంటూ సమాధానమివ్వడం కొసమెరుపు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఓ విద్యార్థి నాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ విద్యార్థి నాయకురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడమేంటని మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రజలపట్ల కటువుగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘తెలంగాణ పోలీసుల తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వాటిని ఏమాత్రం సహించేది లేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకురాలిని ఈడ్చుకెళ్లడం, అసభ్యంగా ప్రవర్తించడమేంటి? ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మానవ హక్కుల కమిషన్ వెంటనే సంబంధిత మహిళా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

అదేవిధంగా ఈ ఘటనపై సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక రాగానే బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు.

You may also like

Leave a Comment