నగరంలోని హోల్ సేల్ మెడికల్ షాప్ లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపారు.. ఈ తనిఖీల్లో భాగంగా మధుమేహ రోగులు వినియోగించే ఇన్సులిన్‌ను అడ్డదారిలో సేకరించి భారీ డిస్కౌంట్లకు విక్రయిస్తున్నట్లు తెలంగణ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పలు హోల్‌సేల్ (Whole Sale) వ్యాపారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు కనిపెట్టారు..

అదేవిధంగా కాప్రా (Kapra)లోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్.. కాచిగూడ శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో 16 లక్షల స్టాక్ సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు వివరించారు.. కాగా ఈ ఇన్సలిన్ను ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుంచి అక్రమంగా సేకరించారని తెలిపారు.. DCA దాడుల్లో భారీ మొత్తంలో ఇన్సులిన్ (Insulin) ఇంజెక్షన్లతో పాటు ప్రీ-ఫిల్డ్ పెన్నుల్ని గుర్తించారు. వీటిని హైదరాబాద్ (Hyderabad)కు చెందిన పలువురు టోకు వ్యాపారులు 40% కంటే తగ్గింపుతో విక్రయిస్తున్నారన్నారు.
రిటైల్ మార్కెట్ ధరలకంటే తగ్గింపు ధరలతో ఈ ఔషధాల విక్రయాలు జరగడంపై పక్కా సమాచారం అందడంతో సోదాలు జరిపినట్లు తెలిపారు. ఈ ఔషధాలు అసలైనవా కాదో నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇన్సులిన్ తయారీ, నాణ్యత, ప్రామాణికతపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిస్కౌంట్లకు ఆశపడి నకిలీ ఔషధాలను కొనుగోలు చేయొద్దని, మందుల ప్రామాణికత నిర్ధారించుకోవాలని, ఈ విషయంలో వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
 
			         
			         
														