రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య నిత్యం ఏదో ఒక అంశంలో వార్ సాగుతూనే ఉంది. పరస్పరంగా ఈ రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవడం కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగి.. రాష్ట్రం అప్పుల పాలైనట్లు కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వం, పాలనలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకొంటున్నారు.

గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారని పేర్కొన్న హరీష్ రావు.. జనం ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారని ధ్వజమెత్తారు.. గత కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు ఎదుర్కొన్నామని.. ప్రస్తుతం మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుస్థితి, దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు..
మారుమూల తండాల్లో సైతం మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని వివరించారు.. పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్ళయినా ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.. ప్రజాపాలన అని చెప్పుకోవడం కాదు ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించాలని సూచించారు..