Telugu News » Telangana : రూటు మార్చనున్న కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం..!

Telangana : రూటు మార్చనున్న కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం..!

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం కేసీఆర్ (KCR) అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. కాగా 17 పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న ఎంపీ అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేయ‌నున్నారు.

by Venu

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)కు చావో రేవో తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మెరుగైన ఓట్లు, సీట్లు సాధించకపోతే పార్టీ మనుగడ కష్టంగా మారే స్థితిని ఎదుర్కొనక తప్పదు.. ఇప్పటికే బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ ను పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహాల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఒకటి, రెండు సీట్లు కూడా గులాబీకి రావనే సవాళ్ళు ఎదురవుతున్నాయి..

cm kcr submitted resignation letter to governorఅలాగే నేతలు కూడా నమ్మకం కోల్పోయి వరుసగా పార్టీని వీడుతున్నారు.. ఇలా అనేక రకాల సమస్యలు గులాబీ బాస్ చుట్టుముట్టాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంది. కానీ తుంటి గాయం కారణంగా ప్రచారం నిర్వహించడం ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గాల వారీగా సభలు పెట్టడానికి కూడా నేతలు ఇష్టపడటం లేదు.

సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. కానీ సొంత పార్టీ కదా.. అందుకే మొత్తానికి సాహసం చేసి.. అతి కష్టం మీద చేవెళ్ల, మెదక్ నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించారు. ఇలా జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్.. బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.. పద్దెనిమిదో తేదీన ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు..

అదే రోజున తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం కేసీఆర్ (KCR) అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. కాగా 17 పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న ఎంపీ అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేయ‌నున్నారు. అలాగే ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కో అభ్య‌ర్థికి రూ. 95 ల‌క్ష‌ల చెక్‌లు ఇవ్వ‌నున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో పది సంవత్సరాలు కింగ్ లా ఉన్న పెద్ద బాస్ పరిస్థితి ప్రస్తుతం కత్తెరలో పోకలా మారిందని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment