Telugu News » Hyderabad : తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..!

Hyderabad : తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..!

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవని అన్నారు. శతాబ్దాలుగా కళాకారులు ఈ కళలలను ప్రదర్శిస్తూ సమాజానికి చేస్తున్న సేవ అమూల్యమైనదని అన్నారు.

by Venu

రాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదని వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసనసభ స్పీకర్ (Legislative Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. నేడు మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ అహోబిల స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ నృత్య కళోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంఖ్య రాజేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) పాల్గొన్నారు. వీరితో పాటు సినీ నటి హరితేజ, ప్రముఖ నృత్య గురువులు డాక్టర్ భాగవతుల సేతురామ్, డాక్టర్ ఆర్ ప్రసన్న రాణి, మిస్ ఇండియా అనిషారెడ్డి, సినీ నటుడు రవితేజ తండ్రి భూపతి రాజు, రాజా గోపాల్ రాజు, పలువురు సినీ తారలు వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య గురువులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవని అన్నారు. శతాబ్దాలుగా కళాకారులు ఈ కళలలను ప్రదర్శిస్తూ సమాజానికి చేస్తున్న సేవ అమూల్యమైనదని అన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన కళాకారులకు పురస్కారాలను అందజేశారు. ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది .

మరోవైపు బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రదర్శనలు ఇచ్చిన నృత్య గురువులను పలువురు ప్రముఖ కళాకారులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. హైదరాబాద్ వేదికగా జాతీయస్థాయి నృత్య ప్రదర్శన అంగరంగ వైభవంగా జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతి దేశానికి ఆదర్శమని కొనియాడారు.

You may also like

Leave a Comment