హైకోర్టుకు, యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో రంగారెడ్డి (Rangareddy) జిల్లా, రాజేంద్రనగర్ (Rajendranagar) అగ్రికల్చర్ యూనివర్సిటీ (Agriculture University)లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకొంది. ఆందోళనకారులు పరీక్ష రాయకుండా విద్యార్థులను అడ్డుకొన్నారు.
ఈ క్రమంలో ఆందోళనకారులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్టూడెంట్స్, ప్రొఫెసర్లను బయటకు పంపించి విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. జీవో నెంబర్ 55ను రద్దు చేసేవరకు పరీక్షలు రాయమని వెల్లడించారు.. మరోవైపు తెలంగాణ (Telangana) ప్రభుత్వం యూనివర్సిటీ భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
ఈ అంశానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాగా, ఇటీవల యూనివర్సిటీ భూముల విషయంలో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. మహిళా ఏబీవీపీ కార్యదర్శి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై రాష్ట్రంలో పెద్ద చర్చ మొదలవగా అధికారులు స్పందించి చర్యలు తీసుకొన్నారు.. మరోసారి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైంది.
మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంతో ఉపయుక్తంగా ఉందని.. అక్కడ 400 రకాల మొక్కలతో పాటు 80 రకాల పక్షులు ఉన్నాయని.. భూములు కేటాయించడం వల్ల జీవవైవిద్యం దెబ్బతింటుందని విద్యార్థులు విన్నవిస్తున్నారు.. తెలంగాణ కొత్త వంగడాల సృష్టి, నూతన పద్ధతులు ప్రవేశ పెట్టడంలో యూనివర్సిటీ కీలకంగా వ్యవహరించిందని తెలిపిన వారు.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..