హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కృష్ణ కుమార్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ (TDR) ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకల్లో బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి ప్రభుత్వానికి తక్కువ ఫీజులు కట్టించేలా కృష్ణకుమార్. శివ బాలకృష్ణ నడుచుకొన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గవర్నమెంట్ కు భారీగా నష్టం కలిగించారని అధికారులు గుర్తించారు.. ఈ మేరకు కృష్ణకుమార్. శివ బాలకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది.
అయితే అమెరికా నుంచి కృష్ణకుమార్ ను హైదరాబాద్ (Hyderabad)కు రప్పించడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే టీడీఆర్ కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కృష్ణకుమార్ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.