Telugu News » Hyderabad : ఆ ఒక్కడు చేసిన పనికి ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం..!

Hyderabad : ఆ ఒక్కడు చేసిన పనికి ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం..!

స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే టీడీఆర్‌ కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు.

by Venu
ACB raids: Whale of corruption.. Former director of HMDA Balakrishna arrested..!

హెచ్‌ఎండీఏ కృష్ణకుమార్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కృష్ణ కుమార్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ (TDR) ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

మరోవైపు ప్రభుత్వం కృష్ణకుమార్ ను ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈయన చేసిన పని వల్ల ప్రభుత్వానికి రూ.3800 కోట్లు నష్టం జరిగిందని‌ అనుమానం వ్యక్తం చేస్తోన్న ఏసీబీ (ACB).. కృష్ణకుమార్ (Krishnakumar) బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మరో ఇద్దరు హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ అధికారుల పాత్ర పై కూపీ లాగుతున్నారు..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకల్లో బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి ప్రభుత్వానికి తక్కువ ఫీజులు కట్టించేలా కృష్ణకుమార్. శివ బాలకృష్ణ నడుచుకొన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గవర్నమెంట్ కు భారీగా నష్టం కలిగించారని అధికారులు గుర్తించారు.. ఈ మేరకు కృష్ణకుమార్. శివ బాలకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది.

అయితే అమెరికా నుంచి కృష్ణకుమార్ ను హైదరాబాద్ (Hyderabad)కు రప్పించడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే టీడీఆర్‌ కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ కృష్ణకుమార్ ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

You may also like

Leave a Comment