Telugu News » Hyderabad : యువతి ప్రాణం తీసిన గ్రూపు-4 పరీక్ష మార్కులు..!

Hyderabad : యువతి ప్రాణం తీసిన గ్రూపు-4 పరీక్ష మార్కులు..!

గ్రూపు-4 పరీక్షల కోసం జవహర్ నగర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ ఇన్నాళ్లు ప్రిపేర్ అయిన యువతి.. శుక్రవార రాత్రి అదే హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది..

by Venu

నగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రూపు-4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ (Hyderabad), చిక్కడపల్లి (Chikkadapally) పోలీస్ స్టేషన్ పరిధిలో శిరీష అనే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీన్ కమిషన్ నిర్వహించిన గ్రూపు-4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనే మనోవేదనతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గ్రూపు-4 పరీక్షల కోసం జవహర్ నగర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ ఇన్నాళ్లు ప్రిపేర్ అయిన యువతి.. శుక్రవార రాత్రి అదే హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది.. కాగా శిరీష ఆత్మహత్య విషయాన్ని గమనించిన తోటి స్టూడెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకొన్న వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

మరోవైపు శిరీష మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా ముప్పారం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, గ్రూపు-4 సర్వీసులో భాగంగా 8,180 పోస్టుల భర్తీకి, టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) గతేడాది రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇందులో మార్కులు తక్కువ వచ్చాయనే భావతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఇకపోతే ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు..

You may also like

Leave a Comment