టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.. గత సంవత్సరం ఎందరో పేరున్న నటులు మరణం బారిన పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొందరు మరణిస్తుండగా.. వృద్ధాప్యం వల్ల మరి కొందరు నటి నటులు మృత్యువాత పడ్డారు.. తాజాగా ప్రముఖ నటుడు (Actor) వీరభద్రరావు (Veerabhadra Rao) చనిపోయారు.

మరోవైపు బుల్లి తెర నటుడు వీరభద్రరావు పలు టీవీ సీరియల్స్ (TV Serials)తో పాటుగా సినిమాల్లో (Movies) సైతం ఎన్నో పాత్రలు చేశారు.. ఈమేరకు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖుల, టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తున్నారు..