Telugu News » Warangal : బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. వలసలకు చెక్ పడుతుందా..?

Warangal : బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. వలసలకు చెక్ పడుతుందా..?

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. బాల్క సుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బాబూ మోహన్‌ను పేరు కూడా వినిపిస్తోంది.

by Venu
brs-party

రాజకీయాలనేటివి కుస్తీ పోటీ లాంటివి.. ఇక్కడ ఆలోచనలతో యుద్ధం చేస్తూ.. బలహీన పడకుండా చూసుకోవాలి.. ప్రత్యర్థుల ఎత్తులను అర్థం చేసుకొంటూ బుద్ధిబలంతో అధికారాన్ని కాపాడుకొంటే.. అంగబలం వెంటే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు చేసే పొరపాట్ల వల్ల ఊహించిన దానికంటే ఎక్కువగా నష్టం కలుగుతోంది.. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పరిస్థితి చూస్తే పార్టీ ప్రస్తానం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కోణాలు కనిపిస్తాయి..

సరిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని పూర్తిగా కొలుకోకుండా చేస్తుందని ఊహించలేక పోయారు.. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇన్నాళ్ళూ బీఆర్ఎస్ అంటే మా ప్రాణం అని తెలిపిన నేతలు సైతం తమదారి తాము చూసుకోవడం కనిపిస్తోంది. ఈ పార్టీలో ఉన్న కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి నాన్ స్టాప్‌గా వెళ్తున్నారు.. ఇటీవల ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీ (BJP)లో, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు.. వీరేగాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ లాంటి కీలక నేతలు సైతం పార్టీ మారారు.. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు.. ఆయన కూతురు హైదరాబాద్ (Hyderabad) మేయర్ విజయలక్ష్మీతో సహ పార్టీని వీడారు.

అదేవిధంగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యతో సహా పార్టీకి షాకిచ్చి.. హస్తం పట్టుకొనేందుకు సిద్దం అయ్యారు.. ఈ నేపథ్యంలో వలసలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. వలసలను చెక్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ ఫోకస్ పెంచిందని అనుకొంటున్నారు.. ముఖ్యంగా కడియం కూతురు కావ్యకు బీఆర్ఎస్, వరంగల్ (Warangal) ఎంపీ టికెట్ ప్రకటించింది.

ఇతర కీలక నేతలను కాదని హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా కావ్యను బరిలోకి దించాలని భావించింది. కానీ తీరా ఆమె హ్యాండ్ ఇవ్వడంతో అధిష్టానం మండిపడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కడియంపై జిల్లా క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ లో బీఆర్ఎస్ శ్రేణులు కడియం దిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేశారు. అయితే ఇదే అవకాశంగా పలువురు సీనియర్ నేతలు ఆ స్థానికి గురిపెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. బాల్క సుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బాబూ మోహన్‌ను పేరు కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో వరంగల్ ఎంపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది.

You may also like

Leave a Comment