Telugu News » Iceland : ద్వీపకల్పంలో బద్దలైన అగ్నిపర్వతం.. జనావాసాలపై ప్రవహిస్తున్న లావా..!!

Iceland : ద్వీపకల్పంలో బద్దలైన అగ్నిపర్వతం.. జనావాసాలపై ప్రవహిస్తున్న లావా..!!

అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవాహాన్ని పెద్ద బండరాళ్ళు అడ్డుకోలేక పోయాయి.

by Venu

ఐస్‌ల్యాండ్‌ (Iceland)లోని రేక్‌జానెస్‌ ద్వీపకల్పం (Reykjanes Peninsula)లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.. ఈ ద్వీపకల్పంలో ఉన్న భారీ అగ్ని పర్వతం (Agni Parvatam) బద్దలైంది. దీని నుంచి వెలువడిన లావా జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఈ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టారు..

అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవాహాన్ని పెద్ద బండరాళ్ళు అడ్డుకోలేక పోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళ్తూన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు ఐస్‌ల్యాండ్‌లో నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ (Blue Lagoon)ను, జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంతో ఇక్కడ నివసించే ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment