Telugu News » Pic Of The Day: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. ఫొటో వైరల్..!

Pic Of The Day: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. ఫొటో వైరల్..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు కుటుంబసభ్యులతో కలిసి వేడుక చేసుకుంటున్నారు. కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా

by Mano
Pic Of The Day: Mega family in one frame.. Photo viral..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు కుటుంబసభ్యులతో కలిసి వేడుక చేసుకుంటున్నారు. కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ రోజు వారు సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Pic Of The Day: Mega family in one frame.. Photo viral..!

అదేవిధంగా, మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆయన ఇంట్లోకి మ‌నుమ‌రాలు క్లింకార రావడం, వ‌రుణ్ తేజ్ లావ‌ణ్యల వివాహాల‌తో ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా ప్ర‌త్యేకమనే చెప్పాలి.

ఈ క్ర‌మంలో మెగా కుటుంబమంతా నిన్న(ఆదివారం) బెంగ‌ళూరులోని ఫాంహౌస్‌కు చేరుకుని పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి వారంతా కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది క‌దా అస‌లు పండుగంటే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ పండ‌గ‌కి ఇప్పుడు క‌ళ వ‌చ్చిందంటూ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న మెగా హీరోలు పండుగ వేళ కుటుంబంతో సమయాన్ని గడిపారు. ఈ ఫ్రేమ్‌లో కుటుంబసభ్యులతో సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు.

You may also like

Leave a Comment