Telugu News » Bandi Sanjay : తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకు లేవు.. ?

Bandi Sanjay : తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకు లేవు.. ?

మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ (Congress) చేతిలో పెట్టామని చెప్పడాన్ని తప్పుపట్టిన బండిసంజయ్.. ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే అని మండిపడ్డారు.. తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? తెలంగాణను ఆరు లక్షల కోట్ల అప్పు చేసి సర్వనాశనం ఎందుకు చేశారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు..

by Venu
Bandi sanjay fire om minister ktr

రాష్ట్రంలో అవినీతిపై చర్చలు జోరుగా సాగుతోన్నాయి. బీఆర్ఎస్ (BRS) పాలనలో భారీ మొత్తంలో స్కామ్ జరిగినట్టు అధికార పార్టీ కాంగ్రెస్.. బీజేపీ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీపై అవినీతి విషయంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలతో ముందుకి వెళ్తున్నట్టు కనిపిస్తుండగా.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

bandi-sanjay-sensational-comments-on-cm-kcr

మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ (Congress) చేతిలో పెట్టామని చెప్పడాన్ని తప్పుపట్టిన బండిసంజయ్.. ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే అని మండిపడ్డారు.. తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? తెలంగాణను ఆరు లక్షల కోట్ల అప్పు చేసి సర్వనాశనం ఎందుకు చేశారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు..

బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నట్టు ? నిరుద్యోగులకు ఉద్యోగాలను ఎందుకు విస్మరించినట్టు? నిరుద్యోగ భృతి హామీ ఎందుకు మరచినట్టని ప్రశ్నించారు.. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యులతో సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.. లేదంటే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరీంనగర్‌ ఈఎన్ గార్డెన్‌లో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తెలిపిన బండి.. దేశమంతా మోదీ గాలి వీస్తోంది. 350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతని ఆరోపించిన బండి సంజయ్.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ (BJP) మధ్య పోటీ ఉంటుందని, పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడాలని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment