Telugu News » Rains: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు!

Rains: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు!

సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

by Sai
rains

అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rains) వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

rains

అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh), తెలంగాణ (Telangana)వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ (Telangana) లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ (Orange alert)ప్రకటించింది. అంతకుముందు సెప్టెంబర్ 2న ఐఎండీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సెప్టెంబరు 7 వరకు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

కాగా, సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్‌ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది.

నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. మోపాల్‌ మండలంలో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లిలో 14.2, జక్రాన్‌పల్లి 13.8, సిరికొండలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్‌-బస్వపూర్‌ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఇక సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్‌ వద్ద లోలెవల్‌ బ్రిడ్జ్‌పై వాహనాలను అధికారులు నిలిపివేశారు.

కామారెడ్డి జిల్లా రాజాంపేట, బీబీపేట, మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మాచారెడ్డి, బిక్కనూర్‌, దోమకొండ మండలాల్లో కుండపోతగా వానపడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గాంధారి మండలంలో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. సదాశివనగర్‌లో 12, జుక్కల్‌లో 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

You may also like

Leave a Comment