Telugu News » Secunderabad-Visakhapatnam : ప్రారంభం అయిన ​రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్.. కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ..!

Secunderabad-Visakhapatnam : ప్రారంభం అయిన ​రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్.. కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ..!

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుందని రైల్వేశాఖ తెలిపింది. ఒక్క గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు​ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

by Venu
modi-to-launch-kachiguda-yashwantpur-vande-bharat-express-on-september-24

సికింద్రాబాద్​-విశాఖపట్నం మధ్య నడవనున్న రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్ (Vande Bharat Express)​ పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను సికింద్రాబాద్​ (Secunderabad) రైల్వే స్టేషన్​ నుంచి వర్చువల్​గా జెండా ఊపి నేడు ప్రారంభించారు. వీటితో పాటుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్​ షెడ్లు, 3 కోచ్​ రెస్టారెంట్లు, 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణరకు శ్రీకారం చుట్టారు.

PM Modi's remarks at beginning of the Budget Session of Parliamentమరోవైపు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుందని రైల్వేశాఖ తెలిపింది. ఒక్క గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు​ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం-సికింద్రాబాద్ (Vizag to Secunderabad)​ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్​ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ఇక రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ టికెట్ల బుకింగ్స్​ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ తెలిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ఈ సందర్భంగా మాట్లాడారు.. రైల్వే ట్రాకులపై తాను జీవితం ప్రారంభించినట్లు తెలిపారు. 2024లో కేవలం రెండు నెలల్లోనే రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించామని పేర్కొన్నారు.. రైల్వేల అభివృద్ధికి గతంలో చేసిన దానికంటే గత 10 ఏళ్లలో ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. వీరిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. అదేవిధంగా దేశంలో మొత్తం వందే భారత్‌ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా ఢిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పది వందేభారత్‌లు అందుబాటులో ఉన్నాయి.

You may also like

Leave a Comment