Telugu News » INS Visakhapatnam: విదేశీ కార్గో నౌక‌పై డ్రోన్ దాడి.. కాపాడిన ఐఎన్ఎస్ విశాఖపట్నం..!

INS Visakhapatnam: విదేశీ కార్గో నౌక‌పై డ్రోన్ దాడి.. కాపాడిన ఐఎన్ఎస్ విశాఖపట్నం..!

మార్ష‌ల్ దీవుల‌కు చెందిన ఎంవీ జెన్‌కో షిప్‌పై డ్రోన్ దాడి చేశారు. అయితే అక్క‌డే పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ‌నౌక‌కు కాల్ వ‌చ్చింది. దీంతో రంగంలో దిగిన ఆ యుద్ధ నౌక‌ కార్గో షిప్‌ను ర‌క్షించింది.

by Mano
INS Visakhapatnam: Drone attack on foreign cargo ship.. INS Visakhapatnam saved..!

భార‌త యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం(INS Visakhapatnam) డ్రోన్ దాడికి గురైన ఓ విదేశీ నౌక‌ను కాపాడింది. మార్ష‌ల్ దీవుల‌కు చెందిన ఎంవీ జెన్‌కో షిప్‌పై డ్రోన్ దాడి చేశారు. అయితే అక్క‌డే పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ‌నౌక‌కు కాల్ వ‌చ్చింది.

INS Visakhapatnam: Drone attack on foreign cargo ship.. INS Visakhapatnam saved..!

దీంతో రంగంలో దిగిన ఆ యుద్ధ నౌక‌ కార్గో షిప్‌ను ర‌క్షించింది. దాంట్లో 22 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో 9 మంది భార‌తీయ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవ‌రికీ ఎలాంటి ముప్పు కలగలేదని, ప్ర‌స్తుతం మంట‌లను అదుపులోకి తెచ్చిన‌ట్లు ఇండియ‌న్ నేవీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

దాడికి గురైన నౌక అమెరికాకు చెందిన ‘జెన్‌కో షికార్డీ’గా గుర్తించారు. ఈ నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌తో బాంబులు జారవిడిచారు. దీంతో కొంత భాగం ధ్వంసమైంది. ప్రస్తుతానికి ఈ నౌక తన ప్రయాణాన్ని సురక్షితంగా తిరుగుప్రయాణమైంది.

గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి హౌతీలు నిరసనలు తెలుపుతూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికా రక్షణ చర్యలకు దిగింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై క్షిపణి, వైమానికదాడులు చేస్తోంది.

You may also like

Leave a Comment