Telugu News » MLC Elections : ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ..!!

MLC Elections : ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ..!!

మొదట కాంగ్రెస్‌ (Congress) అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వెంకట్‌, అద్దంకి దయాకర్‌ పేర్లను ఫైనల్‌ చేసింది. కానీ చివరి నిమిషంలో.. దయాకర్‌ను తొలగించి పీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ పేరును తెరపైకి తెచ్చింది.

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్ (Balmoori Venkat), మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నామినేషన్ వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. కాగా ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

అయితే మొదట కాంగ్రెస్‌ (Congress) అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వెంకట్‌, అద్దంకి దయాకర్‌ పేర్లను ఫైనల్‌ చేసింది. కానీ చివరి నిమిషంలో.. దయాకర్‌ను తొలగించి పీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో వారిరువురు నేడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మరోవైపు అద్దంకి దయాకర్‌ ను బుజ్జగించే పనిలో నేతలున్నారు..

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, AICC కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్ , తుమ్మల, పొంగులేటి, జూపల్లితో పాటు CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే అధికార పార్టీ మినహా మరో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానున్నదని సమాచారం..

You may also like

Leave a Comment