Telugu News » Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ తిరస్కరించిన నళిని.. కారణం ఇదేనా..?

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ తిరస్కరించిన నళిని.. కారణం ఇదేనా..?

రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు తిరిగి నాలో ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానని నళిని వివరించారు.

by Venu

ప్రత్యేక తెలంగాణ (Telangana) ఉద్యమ సమయంలో డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని.. అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అవకాశం కల్పించారు. కానీ, ఆమె నిరాకరించారు.. ఈ నిరాకరణ వెనక పగిలిన గుండె ఘోషను.. అనుభవించిన కన్నీటి వేదనను వినిపించారు.. కాగా 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్‌ డీఎస్పీ (DSP)గా పని చేస్తున్న నళిని తన పదవికి రాజీనామా చేశారు.

ఇలా ఎందరో ఉద్యోగాలను వదిలిన వారు తిరిగి తమ కొలువుల్లో చేరారని, రాజకీయ నేతలు ఇతర పదవులను అనుభవిస్తున్నారని తెలిపిన రేవంత్ రెడ్డి.. నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలను ఆదేశించారు. కానీ నళిని మాత్రం.. రాజీనామా చేసి నేను రాజకీయ నేతల నుంచి తప్పించుకున్నాను. నా ఉద్యోగం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు. కాబట్టి, దయచేసి తనను డిస్టర్బ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

నా లోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారని తెలిపిన నళిని (Nalini).. 12 ఏండ్ల తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి.. నా కేస్ ను వెలికితీయడం చాలా సంతోషంగా వుందని తెలిపారు.. కానీ తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు మీ ద్వారా అర్థం అయ్యిందని భావోద్వేగానికి గురైయ్యారు.. అప్పటి ఘటన నన్ను జీవితంలో ఒంటరిని చేసిందని తెలిపిన నళిని.. అందరూ నన్ను వెలివేశారు. ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్చవంలా బతికానని తెలిపారు.

రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు తిరిగి నాలో ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానని నళిని వివరించారు. సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే.. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండని సూచించారు.. నాకు న్యాయం చేయాలి అనుకొంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని నళిని తెలిపారు..

You may also like

Leave a Comment