ప్రధాని మోడీ(PM Modi) చరిత్ర చిన్నదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) చరిత్ర చాలా గొప్పదని టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లాగా దొంగ వాగ్దానాలు చేయదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటుందని తెలిపారు.
రాహుల్‌ది త్యాగాల కుటుంబం అని అభివర్ణించారు. నెహ్రూ పుట్టినప్పుడు మోడీ, అమిత్‌షా పుట్టి ఉంటే ఆయన గొప్పతనం తెలిసేదని అన్నారు. బీజేపీ నాయకులు ఓట్ల కోసం శ్రీరామున్ని రాజకీయాల్లో లాగుతున్నారని విమర్శించారు. శ్రీరామ చంద్రుడు ప్రజలు అన్నాడే కానీ ఏనాడూ కులాలు, మతాల ప్రస్తావన తీసుకురాలేదని చెప్పారు. కాంగ్రెస్ గొప్పతనాన్ని చెప్పకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సెటైల్ వేరేశారు.
చరిత్ర అంటే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీలదేనని చెప్పుకొచ్చారు. నెహ్రు ,ఇందిరా గాంధీల చరిత్ర గిరించి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరతానని జగ్గారెడ్డి అన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. దేశానికి పంచ వర్ష ప్రణాళికలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవరత్న కంపెనీలు తీసుకొచ్చింది నెహ్రూ కాదా? అని ప్రశ్నించారు.
రైతులు పండించిన పంటను 200 దేశాలకు సరఫరా నెహ్రు చేశారని, భారత్ దేశ ప్రజల కోసం తమ జీవితాలని త్యాగం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ ఉన్నప్పుడు దేశం కోసం శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించారే గానీ ఎవరూ బలిదానాలు చేసుకోలేదన్నారు. స్వాంతంత్ర్యం కోసం చిన్న వయసులోనే 16ఏళ్లు జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి నెహ్రూ అని, 18 ఏళ్లు ప్రధాన మంత్రిగా పనిచేశారని, ఎన్నికల కమిషన్‌ను తీసుకొచ్చిందే నెహ్రూ అని తెలిపారు.
అదేవిధంగా దేశంలో ఆకలి చావులు ఉండొద్దని సాగర్, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులను కట్టించారని చెప్పారు. ఉక్కు కర్మాగారం, ఐడీపీఎల్, ఎన్టీపీసీ, విద్యుత్ రంగం, బీహెచ్ ఈఎల్‌లను తెరిచారని గుర్తుచేశారు. ఇవన్నీ కాంగ్రెస్ చేయలేదని బీజేపీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? అని జగ్గారెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందంటున్న హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ఇవి తెలియాలన్నారు.