Telugu News » Jailer Speed : కొనసాగుతున్న‘జైలర్’ జోరు..నాలుగు రోజుల్లో రూ.150 కోట్లు..! ?

Jailer Speed : కొనసాగుతున్న‘జైలర్’ జోరు..నాలుగు రోజుల్లో రూ.150 కోట్లు..! ?

సూపర్ స్టార్..రజనీనా మజాకా..!‘జైలర్’గా వచ్చిన వింటేజ్ రజనీ..విశ్వరూపం చూపిస్తున్నాడు.బాక్సాఫీస్(box office)వద్ద తన జోరుకొనసాగిస్తున్నాడు.

by sai krishna

సూపర్ స్టార్..రజనీనా మజాకా..!‘జైలర్’గా వచ్చిన వింటేజ్ రజనీ..విశ్వరూపం చూపిస్తున్నాడు.బాక్సాఫీస్(box office)వద్ద తన జోరుకొనసాగిస్తున్నాడు.దీంతో రజనీ ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది.ప్రేక్షకులకు సూపర్ స్టార్ నుంచి మరో మంచి సినిమా వచ్చినట్టైంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్( Action entertainer)గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.


ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా మూడో రోజే వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే.. జైలర్ రజనీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.


ముందు మూడు రోజుల నుంచి నిలకడగా ఉన్న కలెక్షన్స్ ని బట్టి చూస్తే నాలుగో రోజు దాదాపు రూ. 38 కోట్లు వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు(Trade categories) అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి దాకా వచ్చిన జైలర్ కలెక్షన్స్ పరిశీలిస్తే ..నాలుగు రోజుల్లోనే రూ. 146 కోట్లు వసూల్ చేసి..ప్రస్తుతం రూ. 150 కోట్లకు చేరువలో ఉంది.

You may also like

Leave a Comment