Telugu News » Japan: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత..!

Japan: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత..!

దక్షిణ జపాన్‌(South Japan)లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణం సంస్థ తెలిపింది.

by Mano
Taiwan: Trembling Taiwan.. once again a huge earthquake..!

జపాన్‌(Japan)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. దక్షిణ జపాన్‌(South Japan)లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణం సంస్థ తెలిపింది. జపనీస్ దీవులైన క్యుషు, షికోకులను వేరుచేసే జలసంధి బుంగో ఛానల్ కేంద్రంగా భూకంప కేంద్రం నమోదైనట్లు ప్రకటించింది.

Japan: Huge earthquake.. 6.4 magnitude on the Richter scale..!

భూకంపాలు సర్వసాధారణంగా సంభవించే ప్రాంతాల్లో జపాన్ ఒకటి. ప్రపంచంలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో ఐదో వంతు జపాన్‌లోనే వస్తుంటాయి. 2011 మార్చి11న ఈశాన్య తీరంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేగాక అత్యంత బలమైన సునామీ సంభవించింది. ఆ ఘటనతో అణు సంక్షోభం ఏర్పడింది.

ఈ నెల 2వ తేదీన కూడా ఉత్తర జపాన్‌లోని ఇవాట్, అయోరీ ఫ్రిక్చర్లలో భూకంపం రాగా రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైంది. తాజాగా మరోసారి భూకంపం రాగా ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక మీడియా పేర్కొంది.

అధికారులు సైతం సునామీ హెచ్చరికలేం జారీ చేయలేదు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా భూకంపం సంభవిస్తుండగా ఎహైమ్‌లో ఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించిన ఇకాటా అణు కర్మాగారం, ఒక రియాక్టర్ పని చేస్తోంది. అయితే దానికి ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

You may also like

Leave a Comment