Telugu News » Japan Movie Review: జపాన్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్.. కార్తీకి ఇంకో హిట్టు వచ్చేసిందా..?

Japan Movie Review: జపాన్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్.. కార్తీకి ఇంకో హిట్టు వచ్చేసిందా..?

by Sravya

Japan Movie Review: జపాన్ సినిమాని కొంచెం డిఫెరెంట్ గా తీసారు. ఈ సినిమాలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్‌ మిల్టన్‌ తదితరులు నటించారు. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించారు.

Japan Movie Review

చిత్రం : జపాన్
నటీనటులు : కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్‌ మిల్టన్‌ తదితరులు
దర్శకత్వం : రాజు మురుగన్‌
సంగీతం: జి వి ప్రకాష్
నిర్మాత : ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు
విడుదల తేదీ : నవంబర్ 10, 2023

జపాన్ కథ మరియు వివరణ:

ఈ మూవీ ని దర్శకుడు కొత్తగా తీసుకు వచ్చారు. జపాన్ ట్రయిలర్ ని చూస్తే ఇది కాస్త కొత్తగా వెరైటీగా ఉంది. ఈ తరహా సినిమాలేమి రాలేదు. ట్రైలర్ ని గమనిస్తే ఈ మూవీ కథ బాగా సింపుల్ గా ఉన్నట్టు కనపడుతోంది. కానీ సెటప్, నేపథ్యం మాత్రం స్పెషల్ గా డిఫెరెంట్ గా వుంది. కార్తీ క్యారెక్టరైజేషన్ అయితే కొత్తగా వుంది. డిఫరెంట్ మేనరిజమ్స్ తో కార్తీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు ట్రైలర్ ని చూస్తే అర్ధం అయింది. హీరో కార్తీ చెప్పిన డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. కార్తి ఇష్టపడే అమ్మాయి పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అలానే సునీల్, విజయ్ మిల్టన్, తదితరులు కూడా వున్నారు. ఎస్ రవి వర్మన్ క్యాప్చర్ చేసిన విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే వున్నాయి. ఈ మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే, జపాన్ ( కార్తీ ) చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు అలవాటయ్యాయి. దొంగగా మారిన జపాన్ ఎన్నో దొంగతనాలు చేసాడు. వున్నాడు మినిస్టర్ ఇంట్లో డబ్బులు దొంగలించాలి. ఆ డీల్ కి ఒప్పుకుని జపాన్ మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే టైం కి మర్డర్ జరుగుతుంది. జపాన్ ఏ చంపేశాడని అనుకున్న పోలీసులు జపాన్ కోసం వెతుకుతారు. దొంగతనం చేయడానికి ఆ మర్డర్ కి లింక్ ఉందా..? ఆ మర్డర్ ఎవరు చేశారు..? కావాలని ఇరికించేశారా..? ఇవన్నీ తెలుసుకోవడానికి మూవీ చూడాలి.

ఎప్పుడు కూడా కార్తీ డిఫరెంట్ గా వున్నా స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వచ్చిన జపాన్ మూవీ కూడా వెరైటీ గా ఉంది. రాజమురుగన్ సూపర్ గా సినిమాని తీసుకు వచ్చాడు. కార్తీ నటించిన కొన్ని సీన్లు బాగా హైలెట్ అయిపోయాయి. కార్తీ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని మూవీ ని బాగా తీశారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ని ఇచ్చారు. పైగా మూవీ సస్పెన్స్ కూడా బావుంది. కామెడీ, సస్పెన్స్, బిజీయం నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కార్తీ నటనలో వేరియేషన్స్
కామెడీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
బిజీయం

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
పాటలు
ల్యాగ్ సీన్స్

రేటింగ్ 2.75/5

Also read:

 

You may also like

Leave a Comment