Telugu News » Jayaprada: ‘జయప్రదను అరెస్ట్ చేయండి..’ పోలీసులకు కోర్టు ఆదేశం..!

Jayaprada: ‘జయప్రదను అరెస్ట్ చేయండి..’ పోలీసులకు కోర్టు ఆదేశం..!

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద(Jayaprada)ను అరెస్ట్ చేయాలని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు(Rampur People's Court) నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

by Mano
Jayaprada: 'Arrest Jayaprada..' Court orders the police..!

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద(Jayaprada)ను అరెస్ట్ చేయాలని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు(Rampur People’s Court) నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రద 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయ్యాయి.

Jayaprada: 'Arrest Jayaprada..' Court orders the police..!

అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జయప్రద ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఎస్​పీలో చేరి, రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్​ ఎంపీగా కొనసాగారు.

ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటికే ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు తాజాగా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ కావడం గమనార్హం. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ప్రజాప్రతినిధుల కోర్టు రాంపుర్​ ఎస్​పీకి ఆదేశాలు జారీ చేసింది.

You may also like

Leave a Comment