Telugu News » Justice NV Ramana is not an arbitrator: జస్టిస్ ఎన్వీ రమణ నిపుణుడైన మధ్యవర్తి కాదు  

Justice NV Ramana is not an arbitrator: జస్టిస్ ఎన్వీ రమణ నిపుణుడైన మధ్యవర్తి కాదు  

ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనే వర్చువల్ ప్రైవేటు వెంచర్ ని ప్రారంభించడం ద్వారా మధ్యవర్తిత్వ లక్ష్యానికి, న్యాయ మర్యాదకు మిస్టర్ రమణ (నేనిక్కడ జస్టిస్, జడ్జి అనే పదాలు వాడలేకపో తున్నాను) తీరని నష్టం కలిగించారని శ్రీరామ్ పంచు అందులో పేర్కొన్నారు.

by Prasanna
Jusice NV Ramana

Justice NV Ramana is not an arbitrator: జస్టిస్ ఎన్వీ రమణ నిపుణుడైన మధ్యవర్తి కాదు

జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) నిపుణుడైన మధ్యవర్తి కాదని, ఆయన్ని సింగపూర్ అంతర్జాతయ మధ్యవర్తిత్వ కేంద్రం, అంతర్జాతీయ మధ్యవర్తుల ప్యానెల్ గా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది, మధ్యవర్తి శ్రీరామ్ పంచు (Sriram Panchu) అన్నారు. అంతే కాదు ఎన్వీ రమణ నియమాకాన్ని నిరసిస్తూ ఎస్ఐఎంసీ (Singapore International Mediation Centre) ప్యానెల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Jusice NV Ramana

Jusice NV Ramana

ఎన్వీ రమణ నియమాకంపై తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్న శ్రీరామ్ పంచు…ఇకపై ఎస్ ఐఎంసీ సంస్థతో తాను ఎటువంటి సంబంధాలు కొనసాగించబోనని, ఈ సంస్థతో తన సంబంధానికి ఇక ముగింపు పలుకుతున్నానని ఏఎంసీ (ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్) సచివాలయానికి ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఆ లేఖలో తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఆ మెయిల్ ఏమని పేర్కొన్నారంటే…

భారత దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉండగా.. హైదరాబాద్ లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనే వర్చువల్ ప్రైవేటు వెంచర్ ని ప్రారంభించడం ద్వారా మధ్యవర్తిత్వ లక్ష్యానికి, న్యాయ మర్యాదకు మిస్టర్ రమణ (నేనిక్కడ జస్టిస్, జడ్జి అనే పదాలు వాడలేకపో తున్నాను) తీరని నష్టం కలిగించారని శ్రీరామ్ పంచు అందులో పేర్కొన్నారు.

ఆయన కారణంగానే తెలంగాణ ప్రభుత్వం ఆ కేంద్రానికి పెద్ద ఎత్తున స్థిరాస్తులను, ప్రజానిధులను కేటాయించిందని.. ఇది అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

రమణపైన, ఆయనకు సంబంధించిన వ్యక్తు లపైన చాలామంది మధ్యవర్తులు, న్యాయవాదులు, ఇతరులు సుప్రీంకోర్టుకు, భారత ప్రభుత్వానికి, ఆడిటర్ అండ్ కంస్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొసీడింగ్స్ కూడా మొదలయ్యాయి. అవి పెండింగ్లో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

కిందిస్థాయిలో సైతం జస్టిస్ రమణ మధ్యవర్తిత్వం వహించిన రికార్డులు ఏవీ లేకున్నా.. ఆయన్ను ‘నిపుణుడైన మధ్యవర్తి’గా అభివ ర్ణించడం విస్మయానికి గురిచేసిందన్నారు.

You may also like

Leave a Comment