Telugu News » IIT Delhi: ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య!

IIT Delhi: ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య!

ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు

by Sai
iit delhi student hangs self in hostel room

ఇటీవల కాలంలో ఐఐటీ స్టూడెంట్స్‌ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌ (Rajasthan)కోటా ప్రాంతంలో ఇటీవల కాలంలో వరుసగా విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన పెడుతున్నాయి. రోజురోజుకు చదువుల ప్రపంచంలో పెరుగుతున్న పోటీ..విద్యార్థుల పాలిట శాపంగా మారినట్లు అనిపిస్తుంది.

iit delhi student hangs self in hostel room

తల్లిదండ్రుల కోరికను తీర్చలేక పోతున్నామనే ఒత్తిడితో, బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఐఐటీ ఢిల్లీ(IIT Delhi)కి చెందిన 21 ఏళ్ల అనిల్‌ కుమార్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. శుక్రవారం తన హాస్టల్ గదిలో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. అయితే విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.అనిల్ కుమార్ ఆత్మహత్య విషయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హస్టల్ వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హస్టల్ గదికి లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారు.

ఉరేసుకుని ఉన్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు, అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. మ్యాథ్స్, కంప్యూటింగ్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థికి గతంలో కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి ఉండటంతో ఆరు నెలలుగా హాస్టల్ గదిలో ఉంటున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment