Telugu News » K Laxman: ‘సీఎం మాటలకే పరిమితమా..?’ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..!

K Laxman: ‘సీఎం మాటలకే పరిమితమా..?’ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..!

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు.

by Mano
Congress Thukkuguda Sabha Utter Plop.. Rajya Sabha MP Laxman's key comments

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్‌ కేసు(Phone Taping Case)పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman)కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. హైదరాబాద్(Hyderabad) నాంపల్లి(Nampally)లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP Office)లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

K Laxman: 'Is it limited to the words of the CM..?' Rajya Sabha member Laxman's key comments..!

ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాత్ర దారులతో పాటు సూత్ర దారుల పేర్లను బయటపెట్టాలని సూచించారు. ఈ వ్యవహారానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆరే మూలకారకులని స్పష్టం చేశారు. నియంతృత్వాన్ని నమ్ముకున్న వాడు నీడను కూడా నమ్మడని కేసీఆర్‌ అదే కోవలోకి కేసీఆర్ వస్తారని ఎద్దేవా చేశారు.

ఎవరిపై నమ్మకం లేని కేసీఆర్ రాజకీయ, మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ ప్రాథమిక హక్కుకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను గమనించే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని అన్నారు.

అదేవిధంగా కేసీఆర్ కుటుంబం అనేక కుంభ కోణాల్లో పాత్రధారులుగా ఉన్నారని స్పష్టమవుతోందన్నారు. ఇటీవలే లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అవినీతి పరులపై తగు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

You may also like

Leave a Comment