కాళేశ్వరం (Kaleswaram) కరప్షన్, మూడు బ్యారేజీల్లోని వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఇరిగేషన్ ఆఫీసర్లతో భేటీ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.

అదేవిధంగా టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామని పేర్కొన్న జస్టిస్ చంద్ర ఘోష్.. లీగల్ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. బ్యారేజీలతో సంబంధం ఉన్న అందరిని కలుస్తాం మాకు కావాల్సిన సహాయక సహకారాలను తీసుకొని విచారణ చేస్తామని.. ఈ క్రమంలో లీగల్ సమస్యలు తలెత్తకుండా ముందుకు వెళ్తామని తెలిపారు.
ఒకవేళ విచారణ కొనసాగించే సమయంలో ఏదైనా ఇబ్బంది అయితే స్టే వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలిపిన ఆయన.. నిర్మాణ సంస్థల తో పాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి వస్తే అందులో వెనుకడుగు వేయమని అన్నారు.. మరోవైపు సెకండ్ విజిట్ లో మేడిగడ్డ (Madigadda) గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీలను పరిశీలన చేస్తామని వివరించారు..