‘చంద్రముఖి’ 2005 సంవత్సరంలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చేస్తాడని కూడా ఎవరూ ఊహించరు. రజనీ తన స్టైలిష్ యాక్టింగ్ ఫీచర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
అద్భుత కథా, కథనంతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రన్ చేయగలిగారు డైరెక్టర్ పి.వాసు. దీంట్లో లవ్,కామెడీ,సస్పెన్స్,అన్నీ మిక్స్ చేసి అటు రజనీ ఫ్యాన్స్ కు,ఇటు సినీప్రియులకు దర్శకుడు వాసు ఫుల్ మీల్స్ పెట్టాడు .
తెలుగులో కూడా రజనీకి ఫ్యాన్ బేస్ ఉండడంతో బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. పాటలు,బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీ లవ్వర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ మూవీ కోసం ఎవరి పాత్రకు వారు న్యాయం చేసినప్పటికీ జ్యోతిక మాత్రం చంద్రముఖిగా కళ్లు ఎర్రజేసి భయపెట్టింది. తన స్టన్నింగ్ యాక్టింగ్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే దర్శకుడు పి.వాసు ‘చంద్రముఖి’కి సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ను ప్లాన్ చేస్తున్నాడు.
కథ మాట ఎలా ఉన్నా..హీరో హీరోయిన్లు మాత్రం మారారు.హీరో కమ్ డ్యాన్సర్ రాఘవ లారెన్స్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, చంద్రముఖిగా బాలీవుడ్ రెబల్ బ్యూటీ కంగనా రనౌత్ చేస్తోంది.ఇప్పటికే రాఘవ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా చంద్రముఖిగా నటిస్తున్న కంగనరనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్లో కంగనా చాలా అందంగా ఉంది. గ్రీన్ కలర్ డ్రెస్సింగ్తో ఒంటి నిండా నగలు ధరించి ఓ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది