ఓ వైపు ప్రేమ పెళ్లి మరో వైపు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రెండూ ఇంపార్టెంటే…అందరికీ ఇలాంటి పరిస్థితులు రావు మరి..! వచ్చినప్పుడు స్పందించే తీరుని బట్టే లైఫ్ టర్న్ తీసుకుంటుంది.కర్ణాక(Karnaka)లోని శివమొగ్గ(Shivamogga)లో సత్యవతి అనే యువతికి ఇలాంటి చిక్కుప్రశ్న తలెత్తింది.
ఎందుకంటే తాను ప్రేమించింది ఎదురింటి వెంకయ్య నో..పక్కింటి ప్రసాద్ నో లేదా కాలేజ్ లోని కనకారావునో కాదు. ఫేస్ బుక్ ఫ్రెండ్ ని సిచ్యుయేషన్ ఎంత సీరియస్సో మీరే అర్ధం చేసుకోండి.లోకల్ ప్రేమనే ఒప్పుకోని పెద్దలు ఫేస్ బుక్ ప్రేమను ఎట్లా ఒప్పుకుంటారు. అయితే ఈ విషయంలో సత్యవతి కాస్త లక్కీ…ఎలాగో వివరాల్లోకి వెళదాం.
శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్కు చెందిన సత్యవతి.. కమలా నెహ్రూ కళాశాల(Kamala Nehru College)లో బీఏ చదువుతోంది. చెన్నైకు చెందిన ఫ్రాన్సిస్తో రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయమైంది. తర్వాత వారి పరిచయం.. ప్రేమగా మారింది.
ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పిన సత్యవతి, ఫ్రాన్సిస్.. అందరినీ పెళ్లికి ఒప్పించారు. ఆదివారం వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే.. అదే రోజున సత్యవతికి బీఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్(BA Economics Final Year) పరీక్ష కూడా ఉంది.
ఆదివారం ఉదయం శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్లో సత్యవతి, ఫ్రాన్సిస్ పెళ్లి జరిగింది. మధ్యాహ్నం ఫ్రాన్సిస్…తన భార్యను బైక్పై ఎక్కించుకుని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లాడు. వివాహ దుస్తుల్లోనే పరీక్ష రాసేందుకు వచ్చిన సత్యవతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.