Telugu News » Kavita : ఎగిరెగిరి పడుతున్నదెవరు .. రేవంత్ పై కవిత మండిపాటు

Kavita : ఎగిరెగిరి పడుతున్నదెవరు .. రేవంత్ పై కవిత మండిపాటు

by umakanth rao
Kavitha kalvakuntla

 

Kavita : తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎగిరెగిరి పడుతున్నారని, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఎమ్మెల్సీకవిత (Kavita) అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఆమె మండిపడుతూ .. పని చేసినవారిని గుర్తించాలని, అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కావాలో, లేకుంటే 3 గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. బుధవారం బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆమె.. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్టు ఉందని ..రాహుల్ గాంధీ చేబట్టిన ‘భారత్ జోడో యాత్ర’ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని పాదయాత్ర చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.MLC Kalvakuntla Kavitha Participated In BRS Public Meeting : 'బోధన్‌లో సీనియారిటీకి, సిన్సియారిటీ మధ్యే పోటి', mlc-kalvakuntla-kavitha-participated -in-brs-public-meeting-at-bodhan-in-nizamabad-district

 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్యే పోటీ అన్నారు. ‘బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ.. మనది పేగు బంధం.. వారిది ఓటు బంధం’ అని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని పేర్కొన్నారు. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణాలో రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నాం .. బోధన్ లో 10 వేలమంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నాం.., 152 చెరువులను బాగు చేసుకున్నాం అని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ కు ఐటీ హబ్ ను తీసుకు వచ్చామని, ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా తెస్తామని అన్నారు.

బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో గులాబీ విప్లవం వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ పాలనను దేశమంతా అందిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని రకాల కులాలవారు, మతాల వారు ఉన్నారని మహారాష్ట్ర నుంచి వచ్చినవారు కూడా ఉన్నారని, అందరినీ కలుపుకుని పోతున్నామని పేర్కొన్నారు.

మళ్ళీ ఎన్నికల్లో షకీల్ భాయ్ ని ప్రజలు గెలిపించాలని ఆమె కోరారు. బోధన్ లోని నాలుగున్నర వేల డ్వాక్రా సంఘాలకు పదేళ్లలో రూ. 2,600 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 10 రోజుల క్రితమే నిజామాబాద్ లో టీ హబ్ ఏర్పాటు చేసి ప్రారంభం రోజునే 250 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

You may also like

Leave a Comment