Telugu News » KCR : ఈసీని రిక్వెస్ట్ చేసిన కేసీఆర్.. అందుకోసం వారం రోజుల గడువు..!

KCR : ఈసీని రిక్వెస్ట్ చేసిన కేసీఆర్.. అందుకోసం వారం రోజుల గడువు..!

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్​ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం ఈ నెల 18 ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది.

by Venu

మాజీ సీఎం కేసీఆర్ బాష గురించి అందరికి తెలిసిందే.. చవట, దద్దమ్మలు అనేది ఆయన లాంగ్వేజ్.. గొంతుల్ని కోసేస్తం, చంపేస్తం ఇలాంటివి ఆయన మ్యానరిజంలో కనిపించే స్పెషల్ రోల్.. మళ్లీ తనే ఎదుటోళ్లను ఇదేం భాష అని విమర్శించడం ఆయన ప్రత్యేకత అని అనుకోని వారు లేరు.. పదవిలో ఉన్నప్పుడు కూడా అంతే కదా.. పీకనీకి పోతున్నరా..? మేడిగడ్డా, బొందలగడ్డా..? ఈ మాటల శైలికి విస్తుపోని వారు లేరు..

KCR's politics around Annadata.. Will this strategy work?తను ముఖ్యమంత్రిగా ఏ భాషైనా వాడొచ్చునట, ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలవర్చుకున్నది ఇదేం భాషో అని అర్థం గాక జుట్టు పీక్కొన్న వారు కూడా ఉన్నారు.. ఇదిలా ఉండగా సిరిసిల్ల (Sirscilla)లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఇటీవల గులాబీ బాస్ కు నోటీసులు (Notices) జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ అంశంపై కేసీఆర్ తాజాగా స్పందించారు.

వారం రోజుల గడువు ఇవ్వాలని ఈసీని కోరారు. మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్​ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం ఈ నెల 18 ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని 2019, 2023లో సైతం ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేసింది.

ఇక కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు తలెత్తాయని, 2014కు ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో మళ్లీ ఆ పరిస్థితి చూస్తున్నామని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్​ అసమర్థత, తెలివి తక్కువతనం వల్ల ఈ పరిస్ధితి వచ్చిందని ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు. రైతుల కుటుంబాలను ఆదుకోకపోతే ఉసురు తగులుతుందనే కామన్ పీపుల్ లాంగ్వేజ్ వాడారు..

You may also like

Leave a Comment