హైదరాబాద్(hyderabad) ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prasanth reddy)అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.
ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 20 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.హైదరాబాద్ హైటెక్‌సిటీలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ జూబ్లీవేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(venkayya naidu), మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఎస్ఆర్డీపీ కింద హైదరాబాద్‌లో 36 ఫ్లై ఓవర్లు నిర్మించామన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి వేముల అన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. ఐటీ సెక్టార్లో హైదరాబాద్ దూసుకుపోతున్నదని తెలిపారు.