Telugu News » Kohli Rohit T20: టీ20లు ఆడేందుకు మేం సిద్ధం.. బీసీసీఐతో కోహ్లీ, రోహిత్‌..!

Kohli Rohit T20: టీ20లు ఆడేందుకు మేం సిద్ధం.. బీసీసీఐతో కోహ్లీ, రోహిత్‌..!

టీ20 జట్టు ఎంపికకు తాము అందుబాటులో ఉంటామని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జరిగే చివరి 3 టీ20ల్లో విరాట్, రోహిత్ ఉంటారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.

by Mano
Kohli Rohit T20: We are ready to play T20s.. Kohli, Rohit with BCCI..!

టీ20(T20) జట్టు ఎంపికకు తాము అందుబాటులో ఉంటామని రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జరిగే చివరి 3 టీ20ల్లో విరాట్, రోహిత్ ఉంటారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్‌తో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం జట్టును ఎంపిక చేయడానికి శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ప్లేయర్లు బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం.

Kohli Rohit T20: We are ready to play T20s.. Kohli, Rohit with BCCI..!

2022 టీ20 వరల్డ్ కప్‌లో చివరగా ఆడిన ఈ ప్లేయర్లు, అప్పటినుంచి పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడలేదు. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీమ్ ఇండియా మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత సొంత గడ్డపై జనవరి 25 మొదలుకానున్న 5 మ్యాచ్‌ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ 20లు ఆడనుంది. ఆ తర్వాత సొంత గడ్డపై జనవరి 25 మొదలుకానున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది.

ఇదిలా ఉండగా అఫ్గానిస్థాన్‌లో జరగబోయే టీ20 సిరీస్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వారిని ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని, అప్పటివరకు వారు ఫుల్‌ ఫిట్‌గా ఉండాలని బోర్డు ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇక, కెప్టెన్ ఎంపికపై సందిగ్దత నెలకొంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యకు గాయాలయ్యాయి. అఫ్గాన్ సిరీస్ జట్టు సెలక్షన్‌కు వారు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సెలక్షల్ కమిటీ కొత్త కెప్టెన్ సారథ్య బాధ్యత అప్పగించాల్సి వచ్చింది. ఒక వేళ రోహిత్‌ అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేస్తే కెప్టెన్‌గా ఉండే అవకాశముంది. లేకపోతే సెలెక్టర్స్ కేఎల్ రాహుల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదీ సాధ్యం కాకపోతే బుమ్రాకు కెప్టెన్ పగ్గాలు అప్పజెప్పే అవకాశమూలేకపోలేదు.

You may also like

Leave a Comment