Telugu News » Tirumala : శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!

Tirumala : శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!

ఆలయ శుద్ధి సమయంలో.. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పారు.

by Sai
koil-alwar-thirumanjanam-performed-in-tirumala-venkateswara-swamy-temple

తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామివారి (Venkateswara swami temple)ఆలయంలో కోయిల్ ఆళ్వార్ (koyil alwar) తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం తిరుమల సన్నిధిలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా.. శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆగమోక్తంగా నిర్వహించారు.

koil-alwar-thirumanjanam-performed-in-tirumala-venkateswara-swamy-temple

ఆనందనిలయం మొదలు బంగారువాకిలి వరకు తిరుమంజనం చేశారు. శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి సహా వస్తువులు అన్నింటిని నీటితో శుభ్రం చేశారు. ఆలయ శుద్ధి సమయంలో.. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.

అనంతరం ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇవాళ నిర్వహించే అష్టదళ పాద పద్మ ఆరాధన సేవ‌ను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. ప్రతి ఏటా నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగితూ వస్తుంది. సోమవారం నాడు 66,199 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ.4.17 కోట్ల రూపాయలు చెల్లిచారు భక్తులు. ఇక మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక సోమవారం నాడు 29,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు., మజ్జిగ., కిచిడి., ఉప్మా., సాంబార్ రైస్., పెరుగన్నం., సుండల్., మంచి అందిస్తోంది. నీటిని టీటీడీ ఇక సామాన్య భక్తుల కొరకు తిరుపతిలోని శ్రీనివాసం., విష్ణు నివాసం., గోవిందరాజ స్వామి వారి సత్రాల్లో ఎస్ఎన్డీ టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.

You may also like

Leave a Comment