Telugu News » Redmi note 13 pro: నెలాఖరులో రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో సిరీస్!

Redmi note 13 pro: నెలాఖరులో రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో సిరీస్!

షీవోమీ ఈ నెలాఖరులో రెడ్‌ మీ నోట్ 13 ప్రో సిరీస్‌ ను విడుదల చేస్తామని ప్రకటించింది.

by Sai
redmi-note-13-pro-series-redmi-note-13-pro-series-is-coming-with-amazing-features-detail

ప్రముఖ చైనా కంపెనీ రెడ్ మీ(Redmi) ఇప్పటి వరకు 12 ప్రో సిరీస్‌ లు మార్కెట్లోకి వచ్చి హిట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా రెడ్‌ మీ ఇప్పుడు నోట్‌ 13 ప్రో సిరీస్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ (SmartPhone)ను లాంచ్‌ చేసింది. ఈ నెలాఖరులో 13 ప్రో సిరీస్‌ చైనాలో లాంచ్‌ కానుందని కంపెనీ తెలిపింది. గత ఏడాదిలో రెడ్ మీ నోట్‌ 12 ప్రో, రెడ్‌ మీ నోట్‌ 12 ప్రో + కి అప్‌ గ్రేడ్ సెక్షన్ ఉంటాయి.

redmi-note-13-pro-series-redmi-note-13-pro-series-is-coming-with-amazing-features-detail

రాబోయే స్మార్ట్‌ఫోన్‌ లు 200 ఎమ్‌పీ బ్యాక్‌ కెమెరా యూనిట్‌ లను టీజర్‌ ద్వారా రివీల్‌ చేసింది. ఇందులో కొత్త మీడియా టెక్‌ చిప్‌ సెట్‌ తో పాటు ఐసోసెల్‌ కెమెరా సెన్సార్ ను కూడా అందిస్తుంది. షీవోమీ ఈ నెలాఖరులో రెడ్‌ మీ నోట్ 13 ప్రో సిరీస్‌ ను విడుదల చేస్తామని ప్రకటించింది.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా స్పెసిఫికేషన్‌లు, చిప్‌సెట్‌ను వెల్లడిస్తుంది. రెడ్‌మి లేటెస్ట్ సిరీస్ శాంసంగ్ మీడియా టెక్‌ తో కలిసి పనిచేసింది…రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ నంబర్లు 2312DRA50C, 2312DRA50Cతో TENAA వెబ్‌సైట్‌లో గుర్తించింది. ఇది 6.67-అంగుళాల OLED డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. 5G కనెక్టివిటీని అందిస్తోంది. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 18జీబీ రామ్‌ తో వస్తుందని అంచనా. రెడ్‌మి నోట్ 13 ప్రో 16జీబీ రామ్‌ వరకు అందిస్తుంది.

TENAA లిస్టు డివైజ్‌ల కోసం 4 రామ్‌ స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కూడా ఉంచవచ్చు. రెడ్‌మి నోట్ 13ప్రో ఫోన్ 5,020mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 880mAh బ్యాటరీని పొందవచ్చు…. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంటుంది..

You may also like

Leave a Comment