Telugu News » Komati Reddy Venkata Reddy : కేటీఆర్ అధికారం కోసం ట్యాపింగ్ రావుగా మారారు.. వెంకటరెడ్డి..!

Komati Reddy Venkata Reddy : కేటీఆర్ అధికారం కోసం ట్యాపింగ్ రావుగా మారారు.. వెంకటరెడ్డి..!

ఎన్నికల్లో అమలుచేయవలసిన వ్యూహాల గురించి పార్టీని విజయం దిశగా నడిపించే అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఆరో తారీఖున జరగబోయే బహిరంగ సభను 10 లక్షల మందితో విజయవంతం చేయాలని పిలునిచ్చారు..

by Venu

త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హాట్ గా మారాయి.. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ (BRS) టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు లోక్ సభ సమరంలో సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం కనిపిస్తుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆ నియోజక వర్గ ముఖ్య నాయకులతో నేడు సమావేశం అయ్యారు..

ఎన్నికల్లో అమలుచేయవలసిన వ్యూహాల గురించి పార్టీని విజయం దిశగా నడిపించే అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఆరో తారీఖున జరగబోయే బహిరంగ సభను 10 లక్షల మందితో విజయవంతం చేయాలని పిలునిచ్చారు.. ఇందుకు అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) గెలుపు తధ్యమని తెలిపిన వెంకటరెడ్డి.. సికింద్రాబాద్‌ (Secunderabad) ఎంపీగా దానం నాగేందర్‌ (Danam Nagender)ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన నాంపల్లి (Nampally)లో ఫిరోజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్‌ ఉంటుందన్నారు.. ఇందుకు బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన ఆయన.. భువనగిరి, నల్లగొండలో గెలుపు కాంగ్రెస్ పార్టీదే అనే ధీమా వ్యక్తం చేశారు..

బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన వల్ల రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించిన మంత్రి.. కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఉండి సికింద్రాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు.. రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేకుండా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ వేసి హైదరాబాద్‌ (Hyderabad) అభివృద్ధి అని డప్పు కొట్టడం చిత్రమని పేర్కొన్నారు.

కేటీఆర్ అధికారం కోసం ట్యాపింగ్ రావుగా మారారని వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.. హైదరాబాద్ ను డెవలప్ చేసింది ఏమీ లేదన్న ఆయన ఓఆర్ఆర్ తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు.. గత ప్రభుత్వం 7 లక్షల అప్పు చేశారు కానీ మూసి ని పట్టించుకున్న పాపాన పోలేదు.. కానీ మా ప్రభుత్వం 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు.. ఇక కాంగ్రెస్‌ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) జోస్యం చెప్పారు..

You may also like

Leave a Comment